గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 10, 2020 , 17:48:23

‘కేస్‌ 99’ ఫస్ట్‌లుక్‌ విడుదల

‘కేస్‌ 99’ ఫస్ట్‌లుక్‌ విడుదల

హైద‌రాబాద్ : మానవ సంబంధాలే ముఖ్య ఆయుధాలుగా తెరకెక్కిన చిత్రం ‘కేస్‌ 99’. ప్రియదర్శిని రామ్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. శనివారం ‘కేస్‌ 99’ ఫిల్మ్ ఫస్ట్‌లుక్‌ను మాస్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ప్రియదర్శిని రామ్ ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తాడు. ఈ సినిమాలో పాలుని, నీటిని వేరుచేసే హంస లాంటి పాత్రతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. దర్శకుడు రామ్‌ మాట్లాడుతూ.. గ్రేట్‌ టెక్నీషియన్‌, అంతకంటే మంచి మనసున్న వ్యక్తి బోయపాటి శ్రీను అన్నారు. వారం పదిరోజుల్లో సినిమాకి సంబంధించిన ఫస్ట్‌కాపీ రెడీ అవుతుంద‌న్నారు. యువ నిర్మాతలు గౌతమ్, కీర్తీ, వివేక్‌లు తమ మెలోడ్రామా అనే కంపెనీ ద్వారా త‌న‌కు మంచి అవకాశాన్ని ఇచ్చార‌న్నారు.  

తారాగ‌ణం:

ప్రియ‌ద‌ర్శిని రామ్‌, తిరువీర్‌, అనువ‌ర్ణ‌, నిహాల్ కోదాటి, అజ‌య్ ఖ‌తుర్వార్‌, అప‌రాజిత‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, క్రియేష్ రాజ్‌, అశోక్ రావు, విజ‌య్ గోప‌రాజు, మ‌నోజ్ ముత్యం, నితిన్‌, ప్ర‌స‌న్‌, రోష‌న్‌


సాంకేతిక బృందం: 

రచన, దర్శకత్వం: ప్రియదర్శిని రామ్‌ 

నిర్మాత‌లు:  చిలుకూరి కీర్తి, గౌత‌మ్‌రెడ్డి, వివేక్‌రెడ్డి

సినిమాటోగ్ర‌ఫీ: టి.సురేంద్ర‌ రెడ్డి

సంగీతం: ఆషిక్‌ అరుణ్‌

ఎడిటర్‌: శివ శ‌ర్వాణీ

పీఆర్వో: వంశీ-శేఖర్‌



logo