మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 15, 2020 , 10:09:28

మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడి పెళ్లి వాయిదా...!

మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడి పెళ్లి వాయిదా...!

క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార స్వామి త‌న‌యుడు నిఖిల్ గౌడ పొలిటీషియ‌న్‌గానే కాకుండా న‌టుడిగాను ఇటు తెలుగు అటు క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు.జాగ్వార్ చిత్రంతో ఆయ‌న తెరంగేట్రం చేశాడు. ఇటీవ‌ల ఆయ‌న‌కి రేవతితో సంబంధం కుద‌ర‌గా, రామనగర జానదలోక వద్ద భారీ ఏర్పాట్లతో వివాహం జ‌ర‌పాల‌ని ఫ్యామిలీ ప్లాన్ చేసింది. కాని క‌రోనా కార‌ణంగా పెళ్లి వాయిదా ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ల‌క్ష మంది జ‌నం మ‌ధ్య రామ‌న‌గ‌ర‌లోని జాన‌ద‌లోక వ‌ద్ద భారీ ఏర్పాట్ల‌తో వివాహం జ‌ర‌పాల‌ని కుమార‌స్వామి భావించాడు. కాని క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో పెళ్లిని వాయిదా వేయాలా లేదంటే కొద్దిమంది వీఐపీలు, బంధువుల మధ్య వివాహం చేయాలనే ఆలోచనలో కుమారస్వామి కుటుంబం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల‌లో దీనిపై ఓ క్లారిటీ రానుంది. 


logo