శనివారం 04 జూలై 2020
Cinema - May 27, 2020 , 08:31:45

క‌రోనా క‌ల‌క‌లం..లారెన్స్ ఫౌండేష‌న్‌లో 21మందికి క‌రోనా

క‌రోనా క‌ల‌క‌లం..లారెన్స్ ఫౌండేష‌న్‌లో 21మందికి క‌రోనా

క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. పిల్ల‌లు, పెద్ద‌లు, ముస‌లి ఇలా ప్ర‌తి ఒక్క‌రిపై క‌రోనా పంజా విసురుతూనే ఉంది. తాజాగా లారెన్స్ ఫౌండేష‌న్ లో 18 మంది పిల‌ల్ల‌కి, ముగ్గురు ఉద్యోగులకి క‌రోనా సోకిన‌ట్టు రిపోర్ట్స్‌లో తేలింది.  21 మందికి కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన‌ట్టు ఫౌండేష‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

క‌రోనా సోకిన వారిని  చెన్నైలోని లయోలా కాలేజీలోని వైద్య శిబిరానికి తరలించారు.  బాధితులందరూ ఆరోగ్యంగా ఉన్నారని  స‌న్నిహిత‌ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన ట్రస్ట్ కూడా స‌భ్యుల‌ని కూడా పరీక్షించబడే అవకాశం ఉంది.  లారెన్స్ కొద్ది రోజులుగా ‌ అనాథలు, దివ్యాంగుల కోసం స్థానిక అశోక్‌నగర్‌లో  ‌ ట్రస్ట్‌ ద్వారా అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 


logo