మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 14:47:07

కారు ప్ర‌మాదానికి, అభిరామ్‌కు సంబంధం లేదు..

కారు ప్ర‌మాదానికి, అభిరామ్‌కు సంబంధం లేదు..

రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ ద‌గ్గుబాటి సురేశ్ కుమారుడు అభిరామ్‌ కారు ప్ర‌మాదానికి గురైంద‌న్న వార్త‌ల‌ను అభిరామ్ కుటుంబ‌స‌భ్యులు కొట్టిపారేశారు. మ‌ణికొండ లోని పంచ‌వ‌టి కాలనీలో ఎదురుగా వ‌స్తున్న కారును అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ఢీట్టింద‌ని మీడియాలో వస్తున్న వార్త‌లు వ‌దంతి మాత్ర‌మేన‌ని, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన‌ది కాద‌ని కుటుంబ‌స‌భ్యులు  స్ప‌ష్టం చేశారు. 

ఆన్ లైన్ లో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని అభిరామ్ ఫ్యామిలీ ఖండించింది. ఈ విష‌యంలో దయ‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మి..వాటిని ప్ర‌చారం చేయొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo