మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 23, 2020 , 08:56:44

బండి తోసి అల‌సిన అరియానా.. కెప్టెన్‌గా అవినాష్‌

బండి తోసి అల‌సిన అరియానా.. కెప్టెన్‌గా అవినాష్‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో మ‌నుషులు, రాక్ష‌సులు టాస్క్‌లో విజేత‌లుగా నిలిచిన అవినాష్‌, అరియానాల‌కి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. బండి తోయ‌రా బాబు అనే టాస్క్‌లో ఇద్ద‌రు కెప్టెన్సీ దారులు గార్డెన్ ఏరియాలో ఉన్న ట్రాలీల‌పై ఇంటి స‌భ్యుల‌ని ఎక్కించుకొని త‌మ స్టేష‌న్‌లో వ‌దలాల్సి ఉంటుంది. ఎవరి స్టేష‌న్‌లో ఎక్కువ ఇంటి స‌భ్యులు ఉంటారో వారు ఈవారం కెప్టెన్ అయ్యే అవ‌కాశాన్ని పొందుతారు అని బిగ్ బాస్ స్ప‌ష్టం చేశారు.

 బండి తోయ‌రా బాబు అనే టాస్క్ ప్రారంభం కాగా, అరియానా, అవినాష్‌లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ట్రాలీలో ఇంటి స‌భ్యుల‌ని ఎక్కించుకొని వారి వారి స్టేష‌న్ లో దింపారు. అయితే ఇద్ద‌రు స్టేష‌న్‌లో ఐదుగురు స‌భ్యులు ఉండ‌డంతో పోటీ టై అయింది. దీంతో మ‌రో రౌండ్ ఆడించారు. ఈ సారి ప్ర‌త్య‌ర్ధి టీంలో ఉన్న ఇంటి స‌భ్యుల‌ని త‌మ స్టేష‌న్‌లోకి తెచ్చుకోవ‌ల‌సి ఉంటుంద‌ని బిగ్ బాస్ అన్నారు. దీంతో అరియానా ప్ర‌త్య‌ర్ధి టీంలో ఉన్న స‌భ్యుల‌ని త‌నటీంలోకి తెప్పించుకునేందుకు చాలా ప్ర‌య‌త్నం చేసింది. కాని చ‌ర్చ‌లు విఫ‌ట‌లం అయ్యాయి. అరియానా టీంలో ఉన్న మోనాల్‌.. అవినాష్‌ టీంలోకి రావ‌డంతో అవినాష్‌ విన్న‌ర్‌గా నిలిచాడు.

బిగ్ బాస్ విన్న‌ర్ బ్యాండ్‌ను నోయ‌ల్‌.. అభిజిత్‌కు అందించ‌గా, అది ధ‌రించి ఇంటి స‌భ్యులు అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. ఇక త‌న ఫ్రెండ్ అరియానాని రేషన్ మేనేజ‌ర్‌గా అవినాష్ నియ‌మించ‌డంతో అంద‌రు  అత‌నిని ప్ర‌శంసించారు. మంచి నిర్ణ‌యం తీసుకున్నావంటూ పొగ‌డ్త‌లు కురిపించారు. 

అయితే ఇంటికి కెప్టెన్‌గా ఎంపికైన అవినాష్ కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నాడు. మైక్ పెట్టుకోవ‌డం మ‌రచిపోయిన వాళ్ళు 100 సార్లు మైక్‌ని తీస్తూ పెడుతూ మరిచిపోయా అని చెప్పాల‌ని అన్నాడు. ఇక  ఏ ఇంటి సభ్యుడైనా నిద్రపోవడం వల్ల రెండు సార్లు కుక్క‌లు మొరిగితే వారు  రెండు సార్లు పూల్‌లో దూకాలని కండిషన్ పెట్టాడు. అలాగే, ఎవరైనా ఇంగ్లిష్‌లో మాట్లాడితే బిగ్ బాస్ ప్రతి కెమెరా దగ్గరకు వెళ్లి చిన్న పిల్లాడిలా లేదంటే చిన్న పిల్లలా ‘ఇంకోసారి ఇంగ్లిష్‌లో మాట్లాడను బిగ్ బాస్’ అని చెప్పాలి అని ఇంటి స‌భ్యుల‌కు తెలియ‌జేశాడు. వీటికి అంద‌రు స‌మ్మ‌త‌మే అని తెలిపారు


logo