బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం వెకేషన్లో భాగంగా మాల్దీవుల్లో ఉన్నవిషయం తెలిసిందే.అక్కడ దిగిన ఫొటోలని షేర్ చేస్తూ కరీనా నెటిజన్స్‌కి ఆనందాన్ని కలిగిస్తుంది.ఈ ముద్దుగుమ్మ ఫిబ్రవరి 2021లో తమ రెండవ కొడుకుకు స్వాగతం పలకగా, అతనికి ‘జెహ్’ (Jeh) అని పేరు పెట్టారు. ‘జెహ్’ అనేది లాటిన్ పదం. దీని అర్థం “బ్లూ క్రెస్టెడ్ బర్డ్”.
2012లో సైఫ్, కరీనా ప్రేమ వివాహం చేసుకోగా, వీరికి ఇప్పటికే తైమూర్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే రెండో కుమారుడిని ప్రపంచానికి కనిపించకుండా చాలా సీక్రెట్‌గా దాస్తూ వచ్చారు ఈ దంపతులు. కాని జెహ్ ని సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పరిచయం చేసింది. తన తండ్రి సైఫ్‌కి బర్త్‌డే విష్ చేసే క్రమంలో ఓ ఫొటోని షేర్ చేయగా, అందులో జెహ్ కూడా ఉన్నాడు.
కరీనా చేతుల్లో ఉన్న జెహ్ ఎంతో ముద్దుగా కనిపిస్తున్నాడు. చిన్నప్పుడు తైమూర్ ఎలా ఉన్నాడో, ఇప్పుడు జెహ్ కూడా అలానే ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కరీనా తన ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్కు ఆమె ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్’ అనే టైటిల్‌తో విడుదల చేసింది. కాగా, నటుడు సైఫ్ అలీఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.