శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Jul 30, 2020 , 12:13:46

మ‌నీషా కోయిరాలా యోగాస‌నాలు..ఫోటోలు వైర‌ల్

మ‌నీషా కోయిరాలా యోగాస‌నాలు..ఫోటోలు వైర‌ల్

ఒక‌ప్పుడు కుర్ర‌కారు హృద‌యాలు దోచుకున్న గ్లామ‌ర‌స్ క్వీన్ మ‌నీషా కోయిరాలా. తెలుగు,హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో న‌టించిన మనీషా కొయిరాలాకు 2012 లో అండాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.వైద్యం త‌ర్వాత పూర్తిగా కోలుకున్న మ‌నీషా 2018 లో ప్రచురించబడిన హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్ అనే పుస్తకంలో ప్రాణాలతో బయటపడటం గురించి రాసింది.

త‌న ఫిట్‌నెస్‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టే మ‌నీషా కోయిరాలా తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యోగాస‌నాల‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. మనీషా యోగాను అభ్యసించడం వెనుక ఉన్న తత్వశాస్త్రాన్ని కూడా పంచుకున్నారు.  ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ యోగా ఉపాధ్యాయులలో ఒకరైన దివంగత యోగా అభ్యాసకుడు బీకేయస్ అయ్యంగార్ తో ఆస‌నాలు వేసింది. యోగా మ‌నం చూసే విధానాన్ని మార్చదు. ప‌రిస్థితుల‌ని మార్చుతుంది అని మ‌నీషా పేర్కొంది. మ‌నీషా పోస్ట్‌కి నెటిజ‌న్స్ మీర ప‌రివ‌ర్త‌న అద్భుతం. మీరు నీజ‌మైన పోరాట యోధులు అంటూ కామెంట్స్ పెడుతున్నారు  .లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.