మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 20:36:54

ఈ న‌టుడెవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

ఈ న‌టుడెవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

అక్టోబ‌ర్ 20-1972 సినీ ప‌రిశ్ర‌మ‌కు ఓ న‌టుడు ప‌రిచ‌య‌మైన రోజు. 12 ఏండ్ల ప్రాయంలోనే స్టేజీపై దుర్యోధ‌నుడి పాత్ర వేశాడు. ఆ తర్వాత మొద‌ట నెగెటివ్ రోల్స్, చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ సోలో హీరోగా మారాడు. త‌న‌దైన డైలాగ్ డెలివ‌రీతో న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్న యాక్ట‌ర్. న‌టుడిగా, నిర్మాత‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా అంద‌రినీ అల‌రించిన వ్య‌క్తి. ఇంత‌కీ ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? న‌ట‌న కోస‌మే పుట్టాడా అన్న‌ట్టుగా క‌నిపిస్తున్న ఈ వ్య‌క్తి సాయికుమార్‌.

నేడు అక్టోబ‌ర్ 20వ తేదీ కావ‌డంతో ఈ ఫొటోను సాయికుమార్ ట్విట‌ర్ లో షేర్ చేసుకున్నారడు. అక్టోబ‌ర్ 20 1972..నాకు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే రోజు. న‌టుడిగా తెరంగేట్రం. మీరు నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయ‌త‌ల‌ను ఆశీర్వ‌చ‌నాలుగా భావిస్తున్నా. దుర్యోదనుడి గెట‌ప్ లో ఉన్న ఫొటోను ట్విట‌ర్ లో షేర్ చేశాడు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.