శుక్రవారం 15 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 14:42:15

కొత్త హీరోయిన్ల‌తో క‌ల‌ర్స్ స్వాతి పోటీ ప‌డ‌నుందా..?

కొత్త హీరోయిన్ల‌తో క‌ల‌ర్స్ స్వాతి పోటీ ప‌డ‌నుందా..?

టాలీవుడ్ హీరోయిన్ క‌ల‌ర్స్ స్వాతి త‌న భ‌ర్త వికాస్ తో కొంత‌కాలంగా దూరంగా ఉంటున్న‌ట్టు వార్త‌లు కాగా..వాటిపై ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. మ‌రోవైపు స్వాతి మ‌ళ్లీ కొంత‌కాలంగా సినిమాల‌పై ఫోక‌స్ పెట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తో తిరిగి హైద‌రాబాద్ కు మ‌కాం మార్చేసింద‌ట‌. ప్ర‌స్తుతం త‌న‌కు స‌రిపోయే కొత్త ఆఫ‌ర్ల కోసం ఎదురుచూస్తుండ‌గా..మ‌రి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స్వాతికి స‌రిప‌డే పాత్ర‌లు ఇస్తారా..?  లేదా అన్న‌ది చూడాలి. సీనియ‌ర్ యాక్ట‌ర్లు చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్ తో క‌లిసి న‌టించేందుకు షూట్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌.

సాధార‌ణంగా యువ హీరోయిన్ల‌ను యువ హీరోల సినిమాల కోసం ఎక్కువ‌గా ఎంపిక చేస్తుంటారు మేక‌ర్స్‌. అయితే మరి పెళ్లి త‌ర్వాత స్వాతి ఎలాంటి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటుందా..? అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం కొత్త హీరోయిన్ల హ‌వా న‌డుస్తున్న నేప‌థ్యంలో స్వాతి వారితో పోటీప‌డగ‌లదా..? అని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు సినీజ‌నాలు. మొత్తానికి రీఎంట్రీతో మ‌ళ్లీ పాత ఇమేజ్ తెచ్చుకోవాల‌న్న స్వాతి ఆశ‌లు నెర‌వేరుతాయా..?  లేదా చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.