ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 15:06:13

ద‌లేర్ మెహందీ పాట‌కు విదేశాల‌లో డ్యాన్స్

ద‌లేర్ మెహందీ పాట‌కు విదేశాల‌లో డ్యాన్స్

ద‌లేర్ మెహందీ పాట‌కు ప‌ర‌వ‌శించని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. 1998లో ‘‘టునాక్ టునాక్ టున్’’ అంటూ దలేర్ మెహందీ పాడిన పాట సంగీత ప్రియులను ఎంత‌గానో ఆకట్టుకుంది. ఇప్ప‌టికీ ఈ పాట వింటూ ప‌ర‌వ‌శించిపోతున్నారు. మ‌న‌దేశంలోనే కాక‌ విదేశాల‌లోను ‘‘టునాక్ టునాక్ టున్’’పాట సంగీత ప్రియుల‌ని ఓల‌లాడిస్తుంది. 

కాలిఫోర్నియాకు చెందిన విలియం సోదరులు ‘‘టునాక్ టునాక్ టున్’’ పాట‌కు నృత్యం చేసి నెటిజన్ల మనసును దోచుకున్నారు. దలేర్ మెహందీ పాటకు విలియం బ్రదర్స్ చేసిన డాన్సు వీడియోను 3.8 మిలియన్ల మంది వీక్షించారు. కాగా, విలియ‌మ్స‌న్ ఫ్యామిలీకి సంబంధించిన న‌లుగురు సోద‌రులు చాలా పాపుల‌ర్. వీరు త‌మ నృత్య నైపుణ్యంతో గాట్ టాలెంట్ జ‌డ్జెస్‌ని ఇంప్రెస్ చేశారు. కాలిఫోర్నియాకు చెందిన న‌లుగురు సోద‌రులు ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మెయింటైన్ చేస్తుండ‌గా, ఇందులో మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు logo