బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 11:15:50

థియేట‌ర్స్ తెర‌వ‌డంపై కీల‌క భేటి.. హాజ‌రు కానున్న క‌ళ్యాణ్‌

థియేట‌ర్స్ తెర‌వ‌డంపై కీల‌క భేటి.. హాజ‌రు కానున్న క‌ళ్యాణ్‌

క‌రోనా వ‌ల‌న గ‌త ఐదున్నర నెల‌లుగా థియేట‌ర్స్ మూత‌బ‌డ్డాయి.  ఈ నేప‌థ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయి. అయితే ఇప్పుడు అన్నీ బిజీనెస్‌లు స‌జావుగా సాగుతున్న నేప‌థ్యంలో థియేట‌ర్స్ కూడా తెర‌వాల‌నే చ‌ర్చ తెరపైకి వ‌చ్చింది. ఇందుకు సంబంధించి జాతీయ స్థాయి నిపుణుల‌తో క‌లిసి కీలక వీడియో కాన్ఫరెన్స్ భేటీ ఈ సెప్టెంబర్ 8 వ తారీఖున న్యూ ఢిల్లీలో జరగనుంది 

వీడియో కాన్ఫ‌రెన్స్ భేటిలో సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన‌నున్నారు. తెలుగు సినిమాకి సంబంధించి సీ. క‌ళ్యాణ్ హాజ‌రు కానున్న‌ట్టు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. ఈయ‌న థియేట‌ర్స్ తెరిచే విష‌యంలో ఏయే అంశాల‌ని ప్ర‌స్తావిస్తార‌నేది ఎనిమిదో తెదీన తెలియ‌నుంది.  


logo