సోమవారం 01 జూన్ 2020
Cinema - May 03, 2020 , 11:25:49

బుట్ట‌బొమ్మ‌.. సాంగ్ ఖాతాలో మ‌రో రికార్డ్

బుట్ట‌బొమ్మ‌.. సాంగ్ ఖాతాలో మ‌రో రికార్డ్

ఇటీవ‌లి కాలంలో అల వైకుంఠ పుర‌ములో సాంగ్స్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రే సినిమాలోని పాట‌ల‌కి రాలేదంటే అతిశ‌యోక్తి కాదేమో. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన బాణీలు శ్రోత‌లని ఎంత‌గానో ఆక‌ట్టుకోవ‌డంతో పాటు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.  సినిమా విడుద‌ల‌కు ముందే ఈ  లిరిక‌ల్ వీడియో సాంగ్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌..’, ‘రాములో రాముల ...’, ‘బుట్ట‌బొమ్మ..’ సాంగ్స్‌కు విప‌రీత‌మైన క్రేజ్ ద‌క్కింది. ఒక్కొక్క సాంగ్ వంద మిలియ‌న్ మార్కును చేరుకున్నాయి.

ఇక సినిమా విడుద‌ల త‌ర్వాత వీడియో సాంగ్స్‌కి వ‌స్తున్న రెస్పాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా బుట్ట‌బొమ్మ సాంగ్ టాప్ సాంగ్‌గా నిలిచింది. ఆ సాంగ్‌లో మంచి ట్యూన్‌తో పాటు బ‌న్నీ డాన్స్ పెద్ద అడ్వాంటేజ్ కావ‌డంతో శిల్పాశెట్టి, దిశా ప‌టానీ, వార్న‌ర్‌ వంటి సెల‌బ్రిటీలు ఆ పాట‌కి డ్యాన్స్‌లు వేసి త‌మ ఇష్టాన్ని ప్ర‌ద‌ర్శించారు. రెండు నెల‌ల క్రితం బుట్ట‌బొమ్మ సాంగ్‌ని యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ప్ర‌స్తుతం ఈ సాంగ్‌కి 150 మిలియ‌న్స్‌‌కి పైగా వ్యూస్‌తో పాటు.. 1.3 మిలియ‌న్ లైక్స్‌ను సంపాదించుకుంది.  రికార్డుల వేల మొద‌లు పెట్టిన ఈ సాంగ్ రానున్న రోజుల‌లో మ‌రిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని చెబుతున్నారు


logo