e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News బుట్ట‌బొమ్మ సాంగ్ ఖాతాలో మ‌రో రికార్డ్..!

బుట్ట‌బొమ్మ సాంగ్ ఖాతాలో మ‌రో రికార్డ్..!

బుట్ట‌బొమ్మ సాంగ్ ఖాతాలో మ‌రో రికార్డ్..!

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందించ‌గా, ఇందులోని ప్ర‌తి పాట శ్రోత‌ల‌ను ఎంత‌గానో అల‌రించింది. సినిమా రిలీజ్‌కు ముందే సాంగ్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా బుట్ట‌బొమ్మ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ పాట ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేస్తుండ‌డం విశేషం.

బుట్ట‌బొమ్మ సాంగ్ రీసెంట్‌గా యూట్యూబ్​లో 601 మిలియన్ల(60 కోట్ల) వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది. తాజాగా ఈ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో 400 మిలియ‌న్ లైక్స్ రాగా, తెలుగులో ఇలాంటి ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు పాట‌గా రికార్డ్ నెల‌కొల్పింది. బుట్ట‌బొమ్మ సాంగ్స్ సాధిస్తున్న రికార్డ్స్ ప‌ట్ల అభిమానుల‌తో పాటు చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేస్తుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ.. పుష్ప సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

ఇవి కూడా చదవండి..

జాబ్‌ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్‌ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బుట్ట‌బొమ్మ సాంగ్ ఖాతాలో మ‌రో రికార్డ్..!

ట్రెండింగ్‌

Advertisement