విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బతుకు బస్టాండ్’. ఐ.ఎన్.రెడ్డి దర్శకుడు. ఇలవల ఫిల్మ్స్ పతాకంపై కవితారెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని ఐటెమ్సాంగ్ను విడుదల చేశారు. ఇందులో బ్రెజిలియన్ మోడల్ జెన్నీఫర్ పిక్కినాటో నర్తించింది. ‘ఈ ఐటెంసాంగ్కు సోషల్మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహవీర్, రచన-దర్శకత్వం: ఐ.ఎన్.రెడ్డి.