సోమవారం 18 జనవరి 2021
Cinema - Nov 03, 2020 , 10:13:45

షారూఖ్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన బుర్జ్ ఖ‌లీఫా

షారూఖ్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన బుర్జ్ ఖ‌లీఫా

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సోమ‌వారం రోజు  55వ బ‌ర్త్‌డే జ‌రుపుకున్నారు. షారూఖ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ మోత మోగింది . సామాన్యులు ,సెల‌బ్రిటీలు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ అందించారు. బుర్జ్ ఖ‌లీఫా కూడా షారూఖ్‌కు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ఈ విష‌యాన్ని షారూఖ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

ప్రపంచంలోనే అతి పెద్ద మ‌రియు ఎత్తైన తెరపై నన్ను చూడటం ఆనందంగా ఉంది. దుబాయ్ ఆతిథ్యం నాకు చాలా న‌చ్చింది. బుర్జ్ ఖ‌లీఫాపై నా పేరు ఫోటో చూసి నాతో పాటు నా పిల్ల‌లు కూడా చాలా సంతోషించారు అని షారూఖ్ పేర్కొన్నాడు. కోల్‌క‌తా టీం ఓన‌ర్‌గా ఉన్న షారూఖ్ ఖాన్ ప్ర‌స్తుతం దుబాయ్ లో ఐపీఎల్ మ్యాచ్ ల‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. త‌న టీంను ప్లేఆఫ్‌లోకి తీసుకెళ్ళేందుకు గాను చాలా కృషి చేస్తున్నాడు. ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే జీరో త‌ర్వాత మరో సినిమా చేయ‌నని బాద్ షా త్వ‌ర‌లో అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు