శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 15:10:12

రూ.100 కోట్ల అపార్టుమెంట్స్ ను కొన్న స్టార్ హీరో..!

రూ.100 కోట్ల అపార్టుమెంట్స్ ను కొన్న స్టార్ హీరో..!

బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో ఎక్కువ‌గా ముంబైలోని నివాస‌ముంటార‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. స్టార్ హీరోలు వారి వారి అభిరుచుల‌కు అనుగుణంగా విల్లాలు కొనుగోలు చేసుకుంటుంటారు. ఇపుడు స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ముంబైలో రూ.100 కోట్ల విలువైన అపార్టుమెంట్స్ ను కొనుగోలు చేశాడ‌నే వార్త హాట్ టాపిక్ గా మారింది. వీటిలో ఒక అపార్టుమెంట్ డూప్లెక్స్ పెంట్ హౌజ్ కాగా..మిగిలిన‌ది సింగిల్ స్టోరీ హోం అపార్టుమెంట్‌. జుహు-వెర్సోవా లింక్ రోడ్డు వెంబ‌డి 14,15, 16వ అంతస్థుల్లో హృతిక్‌రోష‌న్ కొనుగోలు చేసిన విల్లాలున్నాయ‌ట‌.

అపార్టుమెంట్స్ కు 38000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో అరేబియ‌‌న్ సముద్ర ప్రాంతం విస్త‌రించి ఉన్న‌ట్టు టాక్‌. అంతేకాదు 6500 చ‌ద‌ర‌పు అడుగుల టెర్ర‌స్ ఉండ‌టమే కాకుండా..10 పార్కింగ్ స్పాట్స్ కూడా ఉన్న‌ట్టు ముంబై మిర్ర‌ర్ క‌థ‌నంలో వెల్ల‌డించింది. కేవ‌లం డూప్లెక్స్ హోం కోస‌మే రూ.67.5 కోట్లు పెట్టాడ‌ని ఇన్‌సైడ్ టాక్‌. సూప‌ర్ 30, వార్ చిత్రాల‌తో అల‌రించిన హృతిక్ రోష‌న్ క్రిష్ 4 చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. 

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.