శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 15, 2021 , 16:28:34

జ‌వాన్ల‌తో వాలీబాల్ ఆడిన అక్ష‌య్ కుమార్‌..వీడియో

జ‌వాన్ల‌తో వాలీబాల్ ఆడిన అక్ష‌య్ కుమార్‌..వీడియో

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ న‌టిస్తోన్న కొత్త చిత్రం బ‌చ్చ‌న్ పాండే. ఈ సినిమా రాజ‌స్థాన్ లోని జైస‌ల్మీర్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇవాళ ఆర్మీ డే సంద‌ర్భంగా జ‌వాన్లతో విలువైన స‌మ‌యాన్ని గ‌డిపాడు అక్ష‌య్ కుమార్‌. ఆర్మీ డేను పుర‌స్క‌రించుకుని మార‌థాన్ ను ప్రారంభించాడు. ఉద‌యాన్నే జ‌వాన్ల‌తో క‌లిసి వాలీబాల్ గేమ్ ఆడాడు. అక్ష‌య్‌కుమార్‌ జ‌వాన్లు వేసుకున్న‌ట్టుగానే బ్లాక్ డ్రెస్ వేసుకుని, తీవ్ర చలిలో వాలీబాల్ ఆడుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ధైర్య‌వంతులైన జ‌వాన్ల‌ను క‌ల‌వ‌డం, ఆర్మీ డే సంద‌ర్భంగా మారథాన్ ను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంది. వాలీబాల్ కంటే ఉత్త‌మ వామ్ అప్ గేమ్ ఏం ఉంటుంద‌ని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు అక్ష‌య్‌కుమార్‌. కోస్టార్ కృతిస‌న‌న్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ది.  ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బ‌చ్చ‌న్ పాండే చిత్రాన్ని సాజిద్ న‌దియావాలా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియోలోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo