శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 15:52:14

మెహిందీ సెర్మ‌నీలో నేహాక‌క్క‌ర్

మెహిందీ సెర్మ‌నీలో నేహాక‌క్క‌ర్

త‌న గానంతో మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను అల‌రించిన గాయ‌ని నేహా క‌క్క‌ర్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో సింగ‌ర్ రోహ‌న్ ప్రీత్ సింగ్ తో నేహా క‌క్క‌ర్ ఏడ‌డుగులు వేయ‌నుంది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో నేహా-రోహ‌న్ పెండ్లి టాపిక్ జోరుగా న‌డుస్తోంది. నేహాక‌క్క‌ర్ ఇంట‌ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ షురూ అయ్యాయి. ప్ర‌స్తుతం మెహిందీ సెర్మ‌నీ మొద‌లైంది. నేహా క‌క్క‌ర్ కాజువ‌ల్ బ్లాక్ షార్ట్ డ్రెస్ వేసుకుని మెహిందీ సెర్మ‌నీలో పాల్గొన్న ఫొటోలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

మెహిందీ సెర్మ‌నీ  ఫొటోలు చూస్తుంటే నేహా వెడ్డింగ్ లో పంజాబీ సాంప్ర‌దాయ లుక్ లో అల‌రించ‌డం ఖాయ‌మనిపిస్తోంది. ఈ వీకెండ్ లో ఢిల్లీలో నేహా-రోహ‌న్ పెళ్లివేడుక జ‌రుగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అక్టోబ‌ర్ 26న పంజాబ్‌లోని జిర‌క్ పూర్ లో రిసెప్ష‌న్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.