బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 18:29:47

నాతో ఆ నిర్మాత అసభ్యంగా ప్రవర్తించాడు

నాతో ఆ నిర్మాత అసభ్యంగా ప్రవర్తించాడు

ఏ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వకారణం.. సర్వం అమ్మాయిలపై నీచనికృత్య పాపకార్యం అన్నట్లుంది ప్రస్తుతం పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. షో కేస్ ఇండస్ట్రీ కాబట్టి సినిమాల్లో మరింత ఎక్కువగా ఉంది అది. ఇక్కడ అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలపై నీచానికి ఒడికడుతున్నారు కొందరు దర్శక నిర్మాతలు. తమ కామవాంఛ తీరిస్తే తప్ప వాళ్లకు స్క్రీన్ పై కనిపించే అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది అలా బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు మరో అమ్మాయి కూడా ఇలాగే ముందుకొచ్చింది. ఆ భామే బాలీవుడ్ బ్యూటీ మందనా కరిమి. అక్కడ క్యా కూల్ హై హమ్ 3 లాంటి అడల్ట్ కామెడీస్ చేసిన మందనకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు వెబ్ సిరీస్ లలో రెచ్చిపోతుంటుంది కూడా. ఇప్పుడు ఈమె ఓ నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ప్రస్తుతం కోకో కోలా సినిమాలో నటిస్తుంది మందన. అందులో సెక్సీ క్వీన్ సన్నీ లియోన్ మెయిన్ హీరోయిన్. మందన మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర నిర్మాత మహేంద్ర ధరివాల్‌ ప్రవర్తన తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చింది మందన. తనతో ఆయన చాలా దారుణంగా ప్రవర్తించాడని.. మానసిక వేధింపులకు గురిచేశాడని ఆమె చెప్పడం సంచలనంగా మారింది. ఏడాది నుంచి కోకో కోలా షూటింగ్ జరుగుతుంది. ఇచ్చిన డేట్స్ ప్రకారం చూసుకుంటే కరోనా సెలవులు తీసేసినా దివాళీ ముందు రోజు వరకే అంతా పూర్తి చేయాలని.. కానీ చేయలేదని చెప్పుకొచ్చింది. 

అంతే కాదు షూటింగ్ లో తన వంతు అయిపోయిన తర్వాత కూడా గంటసేపు ఎక్స్ ట్రా ఉండమని నిర్మాత చెప్పినట్లు గుర్తు చేసుకుంది మందన. ఎందుకని ప్రశ్నిస్తే వర్క్ ఉందని చెప్పాడని.. అయితే తనకు వేరే మీటింగ్స్ ఉన్నాయని చెప్పడంతో నేరుగా క్యారవాన్ లోకి వచ్చేసాడని చెప్పింది. అప్పుడు తాను బట్టలు మార్చుకుంటున్నానని..దుస్తులు వేసుకుని బయటికి వచ్చి మాట్లాడతాను అని చెప్పినా కూడా వినిపించుకోకుండా తనపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బూతులు తిట్టాడని చెప్పింది. మందన కరిమి వ్యాఖ్యలతో బి టౌన్ ఉడికిపోతుందిప్పుడు. ఏదేమైనా అమ్మాయి తెగించనంత వరకే ఏదైనా.. ఒక్కసారి ఆమె ధైర్యం చేసి అడుగు ముందుకేసిందంటే రచ్చ రచ్చే. మరిప్పుడు మందన కామెంట్స్ తో మహేంద్ర ధరివాల్ పరిస్థితేంటో..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo