శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 12:29:13

డ్ర‌గ్స్ కేసు..ఎన్సీబీ విచార‌ణ‌కు నిర్మాత మ‌ధు మంతెన‌

డ్ర‌గ్స్ కేసు..ఎన్సీబీ విచార‌ణ‌కు నిర్మాత మ‌ధు మంతెన‌

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)అధికారులు డ్ర‌గ్స్ కేసులో ప్ర‌ముఖ నిర్మాత మ‌ధు మంతెన‌కు స‌మ‌న్లు జారీచేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిర్మాత మ‌ధు మంతెన ఇవాళ ముంబైలోని ఎన్సీబీ ఆఫీసులో అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. 

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ టాలెంట్ మేనేజ‌ర్ జ‌య సాహాను మంగ‌ళ‌వారం 6 గంట‌ల‌కు పైగా విచారించిన విష‌యం తెలిసిందే. తాను సీబీడీ ఆయిల్ ను నటి శ్ర‌ద్దాక‌పూర్ కోసం ఆర్డ‌ర్ చేశాన‌ని, ఆన్ లైన్ లో సీబీడీ ఆయిల్ ను కొనుగోలు చేశాన‌ని చెప్పింది. దీంతోపాటుగా త‌న‌కోసం, సుశాంత్‌, రియాచ‌క్ర‌వ‌ర్తి, ప్ర‌ముఖ నిర్మాత మ‌ధు మంతెన కోసం కూడా సీబీడీ ఆయిల్ ను కొనుగోలు చేశాన‌ని చెప్పింది. ఈ నేప‌థ్యంలో మ‌ధుమంతెన‌కు స‌మ‌న్లు జారీ అయ్యాయి.  అదేవిధంగా న‌మ్ర‌త శిరోద్క‌ర్ తో  చేసిన చాటింగ్ చెప్పినా..దీనికి సంబంధించి త‌న‌కు ఏ విష‌యం గుర్తులేద‌ని జ‌య‌సాహా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. సీబీడీ ఆయిల్ ను భార‌త్ లో నిషేధించారు. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మృతి త‌ర్వాత డ్ర‌గ్స్ స్కాండ‌ల్ బీటౌన్ లో క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఇప్ప‌టికే రియాచక్ర‌వ‌ర్తిని అరెస్ట్ చేయ‌గా..ఎన్సీబీ విచార‌ణ‌లో సారాఅలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ తోపాటు ప‌లువురి పేర్ల‌ను చెప్పింది రియా. మ‌రోవైపు బాలీవుడ్ న‌టి దీపికాపదుకొనే, ఆమె మేనేజ‌ర్ క‌రిష్మా మ‌ధ్య డ్ర‌గ్స్ సంబంధిత చాటింగ్ కూడా సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే వైర‌ల్ అయింది. రాబోయే రోజుల్లో డ్ర‌గ్స్ కేసులో ఇంకెన్ని అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.