శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 15:23:16

నితిన్ కోసం ర‌ణ్‌వీర్‌సింగ్ మేక‌ప్ ఆర్టిస్ట్‌..!

నితిన్ కోసం ర‌ణ్‌వీర్‌సింగ్ మేక‌ప్ ఆర్టిస్ట్‌..!

ఇప్ప‌టివ‌ర‌కు ఎంట‌ర్ టైనింగ్ తో అల‌రిస్తూ వ‌స్తోన్న టాలీవుడ్ యాక్ట‌ర్ నితిన్ తొలిసారిగా మూడు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ట్రిపుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు నితిన్‌. ఈ చిత్రానికి పవ‌ర్‌పేట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు టాక్‌. తాజా స‌మాచారం ప్ర‌కారం..నితిన్ 20 ఏండ్లు, మ‌ధ్యవ‌యస్కుడు, 60 ఏండ్ల వ్య‌క్తి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు కోసం డైరెక్ట‌ర్ కృష్ణ‌చైత‌న్య బాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ ర‌షీద్‌ను రంగంలోకి దించుతున్నాడ‌ట‌. 

83 చిత్రంలో ర‌ణ్ వీర్ సింగ్ ను క‌పిల్‌దేవ్‌గా మేక‌ప్ డిజైన్ చేసింది ర‌షీదే కావ‌డం విశేషం. అంతేకాదు ర‌షీద్   ఇటీవ‌లే నితిన్ కు లుక్ టెస్ట్ కూడా చేయ‌గా..మంచి ఫ‌లితాలు క‌నిపించాయ‌ట‌. నితిన్‌-కృష్ణచైతన్య అండ్ టీం స‌మ్మ‌ర్ తర్వాత షూటింగ్‌ను మొద‌లుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. నితిన్ ప్ర‌స్తుతం రంగ్‌దే, చెక్, అంధాధున్ రీమేక్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. వీటిలో రంగ్‌దే త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo