గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 18:08:35

సాజిద్ ఖాన్ నా ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తించారు..

సాజిద్ ఖాన్ నా ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తించారు..

బాలీవుడ్ డైరెక్ట‌ర్ సాజిద్ ఖాన్ పై ప్ర‌ముఖ మోడ‌ల్ పాలా చేసిన ఆరోప‌ణ‌లు ఇపుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. డైరెక్ట‌ర్ సాజిద్ ఖాన్ త‌న 17 ఏండ్ల వ‌య‌స్సులో దారుణంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు ఆరోపించింది. ప్ర‌జాస్వామ్య చ‌నిపోయేందుకు ముందు భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్చ‌ను నిషేధించ‌టానికి ముందే నాకు జ‌రిగిన ఘోరాన్ని బ‌య‌ట‌పెట్టాలనిపించింది. 

మీటూ ఉద్యమం స‌మ‌యంలో చాలా మంది అమ్మాయిలు సాజిద్ ఖాన్ వేధించాడ‌ని ఆరోపించారు. కానీ నేను చెప్పే ధైర్యం చేయ‌లేదు. ఎందుకంటే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన యాక్ట‌ర్ల‌లో నేను కూడా ఒక‌రిని. కుటుంబ‌స‌భ్యుల‌ను పోషించే బాధ్య‌త నాపై ఉండ‌టంతో మౌనంగా ఉన్నా. నేను 17 ఏళ్ల ప్రాయంలో ఉన్న‌పుడు సాజిద్ ఖాన్ న‌న్ను తాకేందుకు ప్ర‌య‌త్నించాడు. హౌస్ ఫుల్ లో న‌టించే అవ‌కాశం ఇవ్వాల‌లంటే..త‌న ముందు దుస్తులు విప్పాల‌ని అడిగాడు. సాజిద్ ఖాన్ ఎంత‌మంది అమ్మాయిల‌తో ఇలా ప్ర‌వ‌ర్తించాడో ఆ దేవుడికే తెలియాలి. సానుభూతి కోసం తాను ఈ విష‌యం చెప్ప‌డం లేద‌ని, చిన్న‌తనంలో ఇలాంటి ఘ‌ట‌నతో మాన‌సికంగా ఎంత కృంగిపోయానో తెలిపేందుకు చెబుతున్నా. ఇలాంటి క్రూర‌మైన స్వ‌భావ‌మున్న వ్య‌క్తులు క‌టాక‌టాల్లోకి పంపించాలని డిమాండ్ చేసింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo