శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 16:01:10

అనురాగ్ మంచి స్నేహితుడు..టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌: హుమాఖురేషి

అనురాగ్ మంచి స్నేహితుడు..టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌: హుమాఖురేషి

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ కాశ్య‌ప్ పై న‌టి పాయ‌ల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లైంగిక ఆరోప‌ణ‌ల విష‌యంలో త‌న పేరు తీసుకురావ‌డంపై బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి స్పందించింది. మీ టూ ఉద్య‌మం ప‌విత్ర‌ను కాపాడాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని హుమా ఖురేషి అభిప్రాయ‌ప‌డ్డ‌ది. అనురాగ్‌, నేను క‌లిసి 2012-13లో గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాకు ప‌నిచేశాం. అనురాగ్ నాకు మంచి స్నేహితుడు. టాలెంట్ క‌లిగిన ద‌ర్శ‌కుడు. అత‌ను నాతోకానీ మరెవ‌రితో కానీ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని నా వ్య‌క్తిగ‌త అనుభ‌వం ద్వారా చెప్తున్నా. ఒక‌వేళ ఎవ‌రైనా వేధింపుల‌కు గురైతే అధికారులు, పోలీసులు, న్యాయ‌వ్య‌వ‌స్థ దృష్టికి తీసుకుపోవాల‌ని హుమా ఖురేషి సూచించారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై నేను కామెంట్ చేయ‌ను. సోష‌ల్ మీడియా వార్ ను, మీడియా ట్ర‌య‌ల్స్ ను నేను న‌మ్మ‌ను. న‌న్ను  ఈ ఉచ్చులోకి లాగినందుకు చాలా కోపంగా ఉంది. కేవ‌లం ఇది నా కోసం మాత్ర‌మే కాదు ప‌నిచేస్తున్న ప్ర‌తీ మ‌హిళ కోసం చెప్తున్నా. ప‌ని చేస్తున్న ప్ర‌దేశంలో ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌హిళ‌లు, పురుషులు స‌మాన బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించి.. మీ టూ ఉద్య‌మం ప‌విత్ర‌ను కాపాడాల‌ని కోరుతున్నా. ఇదే నా చివ‌రి స్పంద‌న‌. ఈ విష‌యంలో మ‌రిన్ని స్టేట్ మెంట్స్ కోసం నా ద‌గ్గ‌ర‌కు రావొద్ద‌ని కోరుతున్నాన‌ని హ్యుమాఖురేషి ట్వీట్ చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.