శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 17:58:40

అలీ ఫ‌జ‌ల్ కు ముద్దు పెట్టిన రిచా..ట్రెండింగ్‌లో ఫొటో

అలీ ఫ‌జ‌ల్ కు ముద్దు పెట్టిన రిచా..ట్రెండింగ్‌లో ఫొటో

త్రీ ఇడియ‌ట్స్‌, ఫ‌క్రీ, ఫ‌క్రీ రిట‌ర్స్న్‌, ల‌వ్ అఫైర్, ప్ర‌స్థానం, హౌజ్ అరెస్ట్ చిత్రాల‌తో ప‌లు హిందీ సినిమాల్లో న‌టించి మెప్పించాడు అలీఫ‌జ‌ల్‌. ఈ యాక్ట‌ర్ నేడు 34వ పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న భాయ్ ఫ్రెండ్ అలీఫ‌జ‌ల్ ను కిస్ చేసిన‌ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రిచా. బాలీవుడ్ న‌టి రిచా చ‌దా, అలీ ఫ‌జ‌ల్ కొంత‌కాలం డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో ఫొటోల ద్వారా నెటిజ‌న్స్‌, ఫాలోవ‌ర్ల‌ను ప‌లుక‌రించేది ఈ జోడి. 

" పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అలీఫ‌జ‌ల్‌. నువ్వు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించావు. మ‌రిన్ని ఫొటోలు మ‌న‌ల్ని ఫాలో అవుతాయి"  అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న రిచా-అలీ ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లిపీట‌లెక్కాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో వెడ్డింగ్ ర‌ద్ద‌యింది. 2013లో వ‌చ్చిన‌ ఫ‌క్రీ సినిమాతో తొలిసారి సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిశారు రిచా-అలీ. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo