గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 14:33:02

జాన్వీక‌పూర్ కు 'వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ' న‌చ్చ‌లేదా..?

జాన్వీక‌పూర్ కు  'వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ' న‌చ్చ‌లేదా..?

క‌రోనా లాక్‌డౌన్ తో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం కాన్సెప్ట్ పెరిగిపోయిన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. చాలా మంది ఇంటిప‌ట్టునే ఉండి త‌మ త‌మ ప‌నుల‌ను చేశారు. సినీ ఇండ‌స్ట్రీకి చెందిన సెల‌బ్రిటీలైతే క‌థ‌లు రాసుకోవ‌డం, వారిలో ఉన్న స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవ‌డం లాంటివి చేశారు. కోవిడ్ టైంను త‌మ‌కిష్ట‌మైన ప‌నుల‌ను చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే బాలీవుడ్ అందాల భామ జాన్వీక‌పూర్ మాత్రం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం కాన్సెప్ట్ బోరుగా ఫీల‌వుతుంది. 

అవును మీరు విన్న‌ది నిజ‌మే..అందుకు ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టిల్ నే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. వైట్ ఫుల్ కోటును వేసుకున్న జాన్వీ లాప్‌టాప్ ముందు చేతిలో స్ట్రా గ్లాస్ ను ప‌ట్టుకుని  కూర్చుని డ‌ల్‌గా క‌నిపిస్తుండ‌టం ఫొటోలో గ‌మ‌నించ‌వచ్చు.  'వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోం చాలా ఫ‌న్నీగా ఉంటుంద‌ని వాళ్లు చెప్పారు..'‌ అంటూ త‌న‌కైతే ఆస‌క్తిలేన‌ట్టుగా క‌నిపిస్తున్న‌ ఇమేజ్‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది. జాన్వీక‌పూర్ ప్ర‌స్తుతం గుడ్ లక్ జెర్నీ చిత్రంలో న‌టిస్తోంది. పంజాబ్ లో షూటింగ్ మొదలైంది. సిద్దార్థ్ సేన్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దీప‌క్ డోబ్రియాల్, మీటా వ‌షిష్ఠ్‌, నీర‌జ్ సూద్‌, సుశాంత్ సింగ్ ఇతర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 
ఇవి కూడా చ‌ద‌వండి..

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo