ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 16:08:07

జాన్వీకపూర్‌ మిర్రర్‌ సెల్ఫీ చూశారా..?

జాన్వీకపూర్‌ మిర్రర్‌ సెల్ఫీ చూశారా..?

దఢక్‌ చిత్రంతో అందరి మనసులు దోచేసింది అందాల తార జాన్వీకపూర్‌. ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే లక్షల్లో ఫాలోవర్లను ఖాతాలో వేసుకుంది. జిమ్‌ వర్కవుట్స్‌, డ్యాన్స్‌ సెషన్‌ కు వెళ్తూ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా మందికి స్పూర్తిగా నిలుస్తుంది జాన్వీ. ఇటీవలే జాన్వీకపూర్‌ తన స్నేహితులతో కలిసి దిగిన పాత ఒకటి ఇన్‌స్టాలో షేర్‌ చేయగా..వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ భామ మిర్రర్‌ సెల్ఫీ దిగిన త్రోబ్యాక్‌ స్టిల్‌ జాన్వీకపూర్‌ ఫ్యాన్స్‌ పేజ్‌లో చక్కర్లు కొడుతోంది.

రెడ్‌ సారీ, లాంగ్‌ హెయిర్‌తో నీలిరంగు బ్యాగు ఒకటి వేసుకుని తన స్నేహితురాలితో దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం గుంజన్‌ సక్సేనా..ది కార్గిల్‌ గర్ల్స్‌ చిత్రంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా నటిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ మూవీ విడుదల కానుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo