శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 17:43:07

టైగ‌ర్ డ్యాన్స్ కు దిశాప‌టానీ ఫిదా..మ్యూజిక్ వీడియో

టైగ‌ర్ డ్యాన్స్ కు దిశాప‌టానీ ఫిదా..మ్యూజిక్ వీడియో

త‌న న‌ట‌న, డ్యాన్స్ తో అభిమానుల‌ను అల‌రించిన బాలీవుడ్ యాక్ట‌ర్ టైగ‌ర్ ష్రాఫ్ ఇపుడు సింగ‌ర్ గా కూడా మారిన సంగ‌తి తెలిసిందే. అన్ బిలీవ‌బుల్ అంటూ టైగ‌ర్ ష్రాప్ పాడిన పాట సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ పాట‌కు టైగ‌ర్ వేసిన స్టైలిష్ స్టెప్పుల‌కు అంద‌రూ ఫిదా అయిపోతున్నారు. ఈ సాంగ్ మ్యూజిక్ వీడియోకు స్టేజిపై టైగ‌ర్ ష్రాప్ చేసిన డ్యాన్స్ పై అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్‌, కోస్టార్ దిశాప‌టానీ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది.

దిశాప‌టానీ ఈ మ్యూజిక్ వీడియోను షేర్ చేస్తూ చాలా స్టైలిష్ గా టైగ‌ర్ వేసిన స్టెప్పులు పిచ్చెక్కిస్తున్నాయ‌న్న‌ట్టుగా 'ఇన్ సానే'  అనే ప‌దాన్ని జోడించింది. దిశాతోపాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా టైగ‌ర్ డ్యాన్స్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo