ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 20:17:02

దిశాప‌టానీ బ్యాక్ టు షూటింగ్‌‌..వీడియో

దిశాప‌టానీ బ్యాక్ టు షూటింగ్‌‌..వీడియో

బాలీవుడ్ హీరోయిన్ దిశాప‌టానీ లాక్ డౌన్ టైంలో వ‌ర్క‌వుట్స్ వీడియోల‌తో నెటిజ‌న్ల‌ను ప‌లుక‌రించిన సంగతి తెలిసిందే. జిమ్ లో వ‌ర్క‌వుట్ వీడియోల‌తో త‌న ఫాలోవ‌ర్ల ఫిట్ నెస్ పాఠాలు చెప్పిందీ బ్యూటి. లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ముఖానికి మేక‌ప్ వేసుకుంది దిశా. ఈ భామ ప్ర‌స్తుతం స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి రాధే..యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ బాయ్ చిత్రంలో న‌టిస్తోంది. ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్ షూట్ లో జాయిన్ కాగా..తాజాగా దిశాప‌టానీ ఇవాళ షూటింగ్ లో చేరింది. మేక‌ప్ రూమ్ లో మేక‌ప్ వేసుకుంటున్న బీటీఎస్ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 

స‌ల్మాన్‌-దిశా ప‌టానీల‌పై ప్ర‌స్తుతం  రొమాంటిక్ గా సాగే పాట‌ను లోనావాలా హిల్స్ లో షూట్ చేస్తున్నారు ప్ర‌భుదేవా అండ్ టీం. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో ర‌ణ్ దీప్ హుడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo