గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 19:41:13

ఊర్వ‌శి ఓపెన్ ఆఫ‌ర్..!

ఊర్వ‌శి ఓపెన్ ఆఫ‌ర్..!

బాలీవుడ్ అందాల భామ ఊర్వ‌శి రూటేలా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ భ‌రద్వాజ్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ బ్లాక్ రోస్ అనే తెలుగు చిత్రంలో న‌టిస్తోంది. డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ఈ మూవీకి క‌థ‌నందించాడు. తాజాగా ఆస‌క్తిక‌ర వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఊర్వ‌శి రూటేలా త‌న‌తో సినిమాలు చేయాల‌నుకున్న నిర్మాత‌ల‌కు మంచి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ ఆ ఆఫ‌ర్ ఏంటంటే..? తెలుగులో మ‌రికొన్ని సినిమాలను చేయాల‌నుకుంటున్న ఈ బ్యూటీ..మ‌హిళా ప్ర‌ధాన పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌మిస్తూనే మ‌రోవైపు క‌థ డిమాండ్ చేస్తే ఎక్స్ పోజింగ్ కూడా రెడీ అంటోంది. మ‌రి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వ‌చ్చిన ఊర్వ‌శి ఓపెన్ ఆఫ‌ర్ ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వినియోగించుకుంటారా..? లేదా అన్న‌ది చూడాలి. 

స‌న‌మ్ రే, హేట్ స్టోరీ 4 వంటి హిట్ చిత్రాల్లో న‌టించిన ఊర్వశి ఈ ఏడాది 'వ‌ర్జిన్ భానుప్రియ' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. జీ5 యాప్ లోఈ మూవీ విడుద‌లైంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo