బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 17:04:59

పుష్పలో 'బ్లాక్ రోజ్' బ్యూటీ స్పెష‌ల్ సాంగ్ ?

పుష్పలో 'బ్లాక్ రోజ్' బ్యూటీ స్పెష‌ల్ సాంగ్ ?

తెలుగులో పాన్ ఇండియా క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ప్రాజెక్టు పుష్ప‌. ఎర్ర‌చంద‌న స్మగ్లింగ్ నేప‌థ్యంలో  డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోండ‌గా..క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్‌సాంగ్‌కు ప్లాన్ చేస్తోంది సుకుమార్-దేశీ శ్రీ ప్ర‌సాద్‌ అండ్ టీం. ఈ పాట‌లో బాలీవుడ్ భామ ఊర్వ‌శి రౌటేలా మెర‌వ‌నుంద‌న్న వార్త ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

బ్లాక్ రోజ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్వ‌శి. ఈ సినిమా నుంచి విడుద‌లైన సాంగ్‌లో హాట్ లుక్ లో అదిరిపోయే స్టెప్పులేసింది. దీంతో పుష్ప మేక‌ర్స్ స్పెష‌ల్ సాంగ్ లో ఊర్వ‌శిని తీసుకోవాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. మ‌రి బ‌న్నీతో ఐటం సాంగ్ చేయ‌డానికి ఊర్వ‌శి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇండోనేషియాలో తెనాలి భామ షికారు

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

'స‌ర్కారు వారి పాట' ఖాతాలో స‌రికొత్త రికార్డ్

' ఆర్ఎక్స్ 100' భామ‌ స్పెష‌ల్ సాంగ్..!

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo