శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 18:17:28

భాయ్‌ఫ్రెండ్ గురించి తాప్సీ ఏం చెప్పిందంటే..!

భాయ్‌ఫ్రెండ్ గురించి తాప్సీ ఏం చెప్పిందంటే..!

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఢిల్లీ భామ తాప్సీ ప‌న్ను. ప్రస్తుతం ర‌ష్మీ రాకెట్ చిత్రంలో న‌టిస్తోంది తాప్సీ. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ డెన్మార్క్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ మ‌థియాస్ బోయెతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుంది. అప్పుడప్పుడు మ‌థియాస్ తో వెకేష‌న్ల‌కు వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది.త‌న రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ గురించి ప‌బ్లిగ్గా ఎప్పుడూ మాట్లాడ‌రెందుక‌ని తాప్సీని ఓ ఇంట‌ర్వ్యూలో అడిగారు.

దీనికి తాప్సీ స్పందిస్తూ..ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తితో డేట్ చేయ‌డం నాకిష్టం లేదు. నా వ్య‌క్తిగ‌త, వృత్తిప‌ర‌మైన జీవితాలు వేర్వేరు. నాకు సంబంధించిన వారి పుట్టిన‌రోజుల్లో పాల్గొన్న‌పుడు ఏదో ఒక స్టిల్ ను పంచుకుంటాను. నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో భాగ‌మైన‌ మథియాస్ విష‌యంలో అదే చేశానని చెప్పుకొచ్చింది. పెండ్లి ప్లాన్ గురించి మాట్లాడుతూ..నేను ఏదో ఒక‌సారి ఐదారు సినిమాలు చేయ‌డానికి బ‌దులు రెండుమూడు సినిమాలే చేయడంపై దృష్టిపెడ‌తాను. అప్పుడే నా వ్య‌క్తిగ‌త జీవితం కోసం స‌మ‌యాన్ని కేటాయించే అవ‌కాశం దొరుకుతుంద‌ని చెప్పుకొచ్చింది.

ప్ర‌స్తుతానికి త‌న ఫోక‌స్ అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, సినిమాలు త‌గ్గించాల‌నుకున్న త‌ర్వాత పెండ్లి గురించి ఆలోచిస్తాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది తాప్సీ. తాప్సీ  ర‌ష్మీ రాకెట్తోపాటు త‌మిళ్‌లో జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రంతోపాటు మ‌రో సినిమా కూడా చేస్తోంది. హిందీలో మ‌రో ప్రాజెక్టును లైన్ లో పెట్టింది.ఇవి కూడా చ‌ద‌వండి..

ర‌కుల్ జిమ్ వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

డెడ్ లైన్’ పెట్టుకున్న హీరోలు ?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo