శుక్రవారం 27 నవంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 16:37:43

'నాగిన్ '‌ గా అల‌రించ‌నున్న శ్ర‌ద్దాక‌పూర్

'నాగిన్ '‌ గా అల‌రించ‌నున్న శ్ర‌ద్దాక‌పూర్

అల‌నాటి అందాల తార శ్రీదేవి లీడ్ రోల్ లో న‌టించిన '‌నాగిన‌'‌, '‌నిగాహెన్'‌ చిత్రాలు ప్రేక్ష‌కులను ఎంత‌గా అల‌రించాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌సరం లేదు. ఈ ప్రాంఛైజీలో డైరెక్ట‌ర్ విశాల్ ఫురియా, నిర్మాత నిఖిల్ ద్వివేది 'నాగిన్ '‌చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి శ్ర‌ద్దాక‌పూర్ లీడ్ రోల్ పోషించ‌నుంది. శ్ర‌ద్దాక‌పూర్ ఈ విష‌యాన్ని ట్విటర్ ద్వారా తెలిపింది. 

'‌ స్క్రీన్ పై నాగిన్ పాత్ర‌లో న‌టించ‌డం చాలా గ‌ర్వంగా భావిస్తున్నా. నేను శ్రీదేవి మేడ‌మ్ 'నాగిన'‌, 'నిగాహెన్' సినిమాలు చూస్తూ పెరిగాను. ఇలాంటి పాత్ర‌ల్లో న‌టించాల‌న్న‌ది నాకు ఎప్ప‌టినుంచో ఉన్న కోరిక '‌  అంటూ ట్విటర్ పోస్ట్ ద్వారా త‌న సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఈ ఏడాది స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డీ, బాఘీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది శ్ర‌ద్దాక‌పూర్. ఈ 2 సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.