శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 18:00:48

జైలు నుంచి విడుద‌లైన రియా చక్ర‌వ‌ర్తి

జైలు నుంచి విడుద‌లైన రియా చక్ర‌వ‌ర్తి

సుశాంత్‌ మరణం కేసులో డ్రగ్స్ లింక్స్ కోణంలో అరెస్టైన న‌టి రియా చ‌‌క్ర‌వ‌ర్తి ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుద‌ల‌య్యారు. బెయిల్ కోసం రియా బాంబే హైకోర్టును ఆశ్రయించగా బుధవారం పలు కండిషన్లు, రూ.లక్ష పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు రియా బైకుల్లా జైలు నుంచి విడుద‌ల‌య్యారు. డ్ర‌గ్స్ లింక్స్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సెప్టెంబ‌ర్ 8న అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేసు విచార‌ణ‌లో భాగంగా రియా సుమారు నెల‌రోజుల‌పాటు జైలులో ఉన్నారు.

రియా చ‌క్ర‌వ‌ర్తి సుమారు నెల రోజుల త‌ర్వాత త‌న ఇంట్లో సొంత బెడ్‌పై విశ్రాంతి తీసుకోనున్నార‌ని..విడుద‌ల సంద‌ర్భంగా ఆమె త‌ర‌పు లాయ‌ర్ స‌తీశ్ మాన‌షిండే పేర్కొన్నారు.  అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన రియా సోద‌రుడు షోవిక్ బెయిల్ ను కోర్టు తిర‌స్క‌రించింది. దీంతో షోవిక్ జైలులోనే ఉండ‌నున్నారు. ఈ కేసులో షోవిక్, మేనేజ‌ర్‌, ప‌ని మనిషి దీప‌క్ తోపాటు మ‌రికొంత‌మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.