శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 18:51:14

ఆస‌క్తిక‌రంగా ‘సీరియ‌స్ మెన్’ ట్రైల‌ర్

ఆస‌క్తిక‌రంగా ‘సీరియ‌స్ మెన్’ ట్రైల‌ర్

బాలీవుడ్ యాక్ట‌ర్ న‌వాజుద్దీన్ సిద్దిఖీ న‌టిస్తోన్న చిత్రం సీరియ‌స్‌మెన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ఈ న‌టుడు ఇపుడు స‌రికొత్త క‌థాంశంతో సీరియ‌స్ మెన్ గా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. మ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబానికి చెందిన వ్య‌క్తి పాత్ర‌లో న‌వాజుద్దీన్ క‌నిపిస్తున్నాడు. అయితే తాను అనుకున్న‌ది న‌వాజుద్దీన్ సాధించ‌లేక‌పోతాడు.  త‌న కుమారుడు ఇంటెలిజెంట్ గా పేరు ప్ర‌ఖ్యాతులు పొందాల‌ని కోరుకుంటాడు.

న‌వాజుద్దీన్ అనుకున్న‌ట్టుగానే అత‌ని కొడుకు స్మార్ట్ కిడ్ గా మీడియా, రాజ‌కీయ‌వేత్త‌ల దృష్టిని ఆక‌ర్షిస్తాడు. ఈ క్ర‌మంలో ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నే క‌థాంశంతో సాగే ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ఓ తండ్రి తన పిల్ల‌లపై ఎలాంటి ఆశ‌లు పెట్టుకుంటారో తెలియ‌జేస్తూ సాగే ట్రైల‌ర్ ప్ర‌తీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాన్ని ట‌చ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ సాగుతోంది. అక్టోబ‌ర్ 2న నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది. సుధీర్ మిశ్రా డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఈ చిత్రంలో నాజ‌ర్‌, శ్వేత‌బ‌సు ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.