ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 28, 2020 , 14:35:58

కరోనా నుంచి రిక‌వ‌రీ..ముంబై వీధుల్లో బాలీవుడ్ న‌టి

కరోనా నుంచి రిక‌వ‌రీ..ముంబై వీధుల్లో బాలీవుడ్ న‌టి

క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా..ఇటీవ‌లే క‌రోనాను జ‌యించి త‌న ఫాలోవ‌ర్ల‌కు సందేశాన్నిచ్చిన సంగ‌తి తెలిసిందే. చాలా రోజుల త‌ర్వాత నా గ‌ది నుండి బ‌య‌టికొచ్చానంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. తాజాగా ఈ బ్యూటీ ఇంటి నుంచి అడుగుపెట్టింది. కోవిడ్ నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమిత‌మైన మ‌లైకా చాలా రోజుల త‌ర్వాత అరోరా తన సోద‌రి అమృతా అరోరా ఇంటికెళ్లింది. లియోపార్డ్ ప్రింట్ టాప్ గ్రే ప్యాంట్ కాస్ట్యూమ్స్ విత్ ఫేస్ మాస్క్ తో కరోనా నిబంధ‌న‌లు పాటించింది. త‌న వెహికిల్ సింగిల్ గా వెళ్తున్న ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

క‌రోనా నుంచి కోలుకునేందుకు స‌హ‌క‌రించిన  బీఎంసీ అధికారులు, వైద్య‌స‌లహాలు, సూచ‌న‌లు అందించిన డాక్ట‌ర్ల‌కు, మ‌ద్ద‌తుగా నిలిచిన కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల‌కు కృత‌జ్ఞ‌త‌లు త‌న సందేశంలో కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది మలైకా.  ద‌య‌చేసి మీరంతా జాగ్ర‌త్త‌లు తీసుకోండి..సుర‌క్షితంగా ఉండండి అని మ‌లైకా అరోరా మెసేజ్ పోస్ట్ లో సూచ‌న‌లు చేసింది.  లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.