బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 14, 2020 , 18:29:45

మ‌లైకా డ్యాన్స్ కు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైర‌ల్

మ‌లైకా డ్యాన్స్ కు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైర‌ల్

బాలీవుడ్ బ్యూటీ మ‌లైకా అరోరా డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ భామ స్టేజీపైకి వ‌చ్చిందంటే చాలు అంద‌రిలో డ్యాన్స్ చేయాల‌న్న జోష్ వ‌చ్చేస్తుంది. ఓ టీవీ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మ‌య్యే ఇండియ‌స్ బెస్ట్ డ్యాన్స‌ర్ షో కు మ‌లైకా అరోరా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. కోవిడ్ నుంచి కోలుకున్న మ‌లైకా ఇటీవ‌లే షో మొద‌టి ఎపిసోడ్ లో పాల్గొని అంద‌రినీ ఎంట‌ర్ టైన్ చేసింది.

కొరియోగ్రాఫర్, జ‌డ్జి టెరెన్స్ లెవిస్, మ‌లైకా అరోరా క‌లిసి స్టేజీపై ‘చ‌డ్ గ‌యా ప‌పి బిచువా’ సాంగ్ కు డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టారు. మ‌లైకాతో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోను టెరెన్స్ లెవిస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌గా..ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. త‌క్కువ టైంలోనే ఈ వీడియోకు 58వేల కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo