శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 18:11:14

కైరా 'హ‌సీనా పాగ‌ల్ దివాని' వీడియో సాంగ్‌

కైరా 'హ‌సీనా పాగ‌ల్ దివాని' వీడియో సాంగ్‌

బాలీవుడ్ భామ కైరా అద్వానీ న‌టిస్తోన్న తాజా చిత్రం ఇందూ కీ జ‌వానీ. ఈ సినిమా నుంచి హ‌సీనా పాగ‌ల్ దివాని వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ పాట‌లో కైరా మెస్మ‌రైజింగ్ లుక్ లో ఆదిత్య‌సీల్ తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ సాంగ్ ఇపుడు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ష‌బ్బీర్ అహ్మ‌ద్ రాసిన ఈ పాట‌ను మికాసింగ్‌, అసీస్ కౌర్ పాడారు.  ఫీమేల్ ఓరియెంటెడ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న  ఇందూ కీ జ‌వానీ చిత్రాన్ని అభిర్ సేన్‌గుప్తా డైరెక్ట్ చేస్తున్నాడు.

త‌న అందం, అభిన‌యంతో ల‌క్షల్లో ఫాలోవ‌ర్ల‌ను ఖాతాలో వేసుకుంది.కైరా అద్వానీ అక్ష‌య్ కుమార్ తో క‌లిసి ల‌క్ష్మీబాంబ్ చిత్రంలో న‌టించ‌డంతోపాటు భూల్ భూల‌య్యా-2, షేర్షా సినిమాల్లో న‌టిస్తోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo