ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 21, 2020 , 17:18:14

చెల్లెలితో స‌ర‌దాగా కైరా అద్వానీ..సెల్ఫీ, వీడియో

చెల్లెలితో స‌ర‌దాగా కైరా అద్వానీ..సెల్ఫీ, వీడియో

లాక్ డౌన్ త‌ర్వాత బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ మ‌ళ్లీ షూటింగ్ ‌కు సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తో క‌లిసి ల‌క్ష్మీబాంబ్ చిత్రం చేస్తోందీ భామ‌. ఇటీవ‌లే కైరా త‌న సోద‌రి ఇషితా అద్వానీతో గ్రీన‌రీ లొకేష‌న్ లో స‌ర‌దాగా హ‌మ్ చేస్తున్న ఫొటోలు, వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తీరిక లేకుండా బిజీగా ఉండే కైరా త‌న‌కు ఎప్పుడు టైం దొరికినా కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఉంటుంది. ఇషితా అద్వానీ సోద‌రి కైరాను ఫాలో చేస్తున్న వీడియోతోపాటు ఈ ఇద్ద‌రు వైట్ అండ్ బ్లూ వేర్ లో  ప‌చ్చిక‌బ‌యళ్ల‌లో దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. త‌న చెల్లెలు ఇషితా త‌న‌తో ఉన్న‌పుడు ప్ర‌తీ విష‌యంలో త‌న‌కు బెట‌ర్ గా అనిపిస్తుంద‌ని క్యాప్ష‌న్ ఇచ్చింది కైరా. 

ల‌క్ష్మీ బాంబ్ తో ఇందూ కీ జ‌వానీ మ‌రో రెండు హిందీ సినిమాల్లో న‌టిస్తోంది కైరా అద్వాని. ఇందూ కీ జ‌వాని  నుంచి ఈ భామ సోలో వీడియో సాంగ్ ను చిత్ర‌యూనిట్ ఇప్ప‌టికే విడుద‌ల చేసింది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.