ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 17, 2020 , 14:30:39

ప్ర‌ధాని మోదీకి కంగ‌నా స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌..వీడియో

ప్ర‌ధాని మోదీకి కంగ‌నా స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌..వీడియో

భార‌త ప్ర‌ధాని న‌రేంద్రమోదీకి ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట‌ర్ లో ఈ మేర‌కు ప్రధాని మోదీకి శుభాకాంక్ష‌లు తెలుపుతూ మ‌నాలీ లోని నివాసం నుంచి ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు కంగనా. న‌రేంద్రమోదీజీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. మోదీలాంటి వ్య‌క్తి ప్ర‌ధానిగా ఉండ‌టం భార‌త‌దేశం దేశం చేసుకున్న అదృష్టం. ఆయ‌న్ను విమ‌ర్శించేవారు, ఆయ‌న‌పై అసంబ‌ద్ద వ్యాఖ్య‌లు చేసే వారున్నా..మెజారిటీ ప్ర‌జ‌లు ప్ర‌ధాని మోదీకి మ‌ద్ద‌తుగా నిలిచార‌ని కంగ‌నా పేర్కొన్నారు.

అదేవిధంగా బాలీవుడ్ న‌టులు అనిల్‌క‌పూర్, అభిషేక్ బ‌చ్చ‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, అనుప‌మ్ ఖేర్ తోపాటు ప‌లువురు న‌టీన‌టులు మోదీకి 70వ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.