ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 19, 2020 , 15:02:16

ప్రీ వెడ్డింగ్..స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా కంగ‌నా

ప్రీ వెడ్డింగ్..స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా కంగ‌నా

బాలీవుడ్ కంగ‌నా ర‌నౌత్ ఆదివారం త‌న సోద‌రుడి ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేషన్స్ లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకుని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండికి వెళ్లిన కంగ‌నా..సోద‌రుడు అక్ష‌త్ ర‌నౌత్ ను ముస్తాబు చేసింది. ప్రీవెడ్డింగ్ వేడుక‌లో కంగ‌నా స్టిల్స్ ఇపుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కంగ‌నా గ్రీన్ క‌ల‌ర్ సిల్క్ సారీ, స్లీవ్ లెస్ బ్లౌస్ డ్రెస్ లో మెరిసి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. మెడ‌ను గోల్డెన్ చోక‌ర్ నెక్లెస్ కు షూట్ అయ్యే చెవిపోగుల‌తో ఫొటోలకు పోజిచ్చి అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 

సోద‌రుడు అక్ష‌త్ వెడ్డింగ్‌ అప్ డేట్స్ ను ఎప్ప‌టిక‌పుడు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంది కంగ‌నా. అక్ష‌త్ వివాహం నవంబ‌ర్ జ‌రుగుతుంద‌ని చెప్పింది. ‌కంగ‌నా ప్ర‌స్తుతం ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తున్న త‌లైవి చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.