మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 17:50:22

ముంబై పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తా: క‌ంగ‌నా

ముంబై పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తా: క‌ంగ‌నా

ముంబై: బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్, శివ‌సేన సీనియ‌ర్‌నేత ముంబై-పీవోకే కామెంట్లు ఇండ‌స్ట్రీలో, రాజకీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో చిక్కుల్లో ప‌డ్డ‌ది. కంగ‌నా గురించి మాజీ భాయ్ ఫ్రెండ్ అధ్యాయ‌న్ సుమన్ చెప్పిన అంశాల ఆధారంగా  డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో విచార‌ణకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. డ్ర‌గ్స్ కేసులో కంగ‌నా పాత్రపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించిందని మ‌హారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్ల‌డించారు. కంగ‌నా ఓ పార్టీలో త‌న‌ను కొకైయిన్ తీసుకోవాల‌ని బ‌ల‌వంతం చేసింద‌ని అధ్యాయ‌న్ సుమ‌న్ చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో పోలీసులతో విచార‌ణ‌కు స‌హ‌కరిస్తాన‌ని కంగ‌నా ర‌నౌత్ చెప్పారు. డ్రగ్స్ వినియోగంపై మీడియా నివేదిక‌ల‌ను ప‌రిశీలించాల‌ని ముంబై పోలీసుల‌కు చెప్పిన మంత్రి చెప్ప‌డం సంతోష‌క‌ర‌మైన విష‌యం. ద‌య‌చేసి నాకు డ్ర‌గ్స్ టెస్టుల‌ను చేయండి. డ్ర‌గ్స్ డీల‌ర్ల‌తో లింక్స్ ఏమైనా దొరికితే నా కాల్ రికార్డుల‌ను ద‌ర్యాప్తు చేయండని కంగా కోరింది. 

ఇంట‌ర్వ్యూలో అధ్యాయ‌న్..మార్చి 2008లో ది లీలాలో ఏర్పాటు చేసిన బ‌ర్త్ డే పార్టీకి త‌న‌తో ప‌నిచేసిన వారంద‌రినీ కంగ‌నా పిలిచింది. కొకైయిన్ ను తీసుకోవాల‌ని అడిగింది. కంగ‌నాతో హ్యాష్ స్మోక్ చేశాను. కానీ న‌చ్చేది కాదు. అందుకే వ‌ద్ద‌ని చెప్పా ను. నేను కొకైయిన్ ను తీసుకునేందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో ఆ రోజు రాత్రి చాలా వాగ్వాదం జ‌రిగింది..అంటూ సుమన్ 2016లో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూ ఇప్ప‌టికే వైర‌ల్ అయింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo