శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 14:37:26

వ‌ర్క్ షాప్ మొద‌లుపెట్టిన కంగ‌నా..వీడియో

వ‌ర్క్ షాప్ మొద‌లుపెట్టిన కంగ‌నా..వీడియో

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌లే త‌న సోద‌రుడి వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ తో బిజీగా గ‌డిపిన విష‌యం తెలిసిందే. ఇక‌ ప్ర‌స్తుతం తేజాస్ చిత్రం షూటింగ్ పనులను షురూ చేసింది. ప్రస్తుతం మ‌నాలీలో ఉన్న కంగ‌నా డైరెక్ట‌ర్ స‌ర్వేశ్ మీవారా, సోద‌రి రంగోలి చందేల్‌, కోచ్ వింగ్ క‌మాండ‌ర్ అభిజిత్ గోఖ‌లేతో క‌లిసి సినిమా వ‌ర్క్ షాప్ లో పాల్గొంది. ఇవాళ తేజాస్ టీం వ‌ర్క్ షాప్ ను ప్రారంభించింది. టాలెంటెడ్ డైరెక్టర్ స‌ర్వేశ్ మెవారా, కోచ్ వింగ్ క‌మాండ‌ర్ అభిజిత్ తో క‌లిసి ప‌ని మొద‌లు పెట్ట‌డం చాలా సంతోషంగా ఉందంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది కంగ‌నా.

ఈ చిత్రంలో కంగ‌నా మహిళా ఫైటర్ పైలట్ ‌గా న‌టిస్తోంది. ఆగ‌స్టులో విడుద‌ల చేసిన తేజాస్ ఫ‌స్ట్ లుక్ లో యుద్ధ విమానం ప‌క్క‌న నిలుచొని కంగ‌నా ధైర్యంగా చూస్తున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. రోనీ స్క్రూవాలా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.