శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 19:03:59

డ్ర‌గ్స్ రాకెట్ తో ఆదిత్యాథాక్రేకు సంబంధాలు: క‌ంగ‌నా

డ్ర‌గ్స్ రాకెట్ తో ఆదిత్యాథాక్రేకు సంబంధాలు: క‌ంగ‌నా

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న ఆఫీసు కూల్చివేత నేప‌థ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేపై విమ‌ర్శ‌లు గుప్పించింది. త‌న మాట‌ల‌తో అవ‌త‌లి వారిని చెమ‌ట‌లు ప‌ట్టించే కంగ‌నా ఇపుడు ఏకంగా సీఎం ఉద్ధ‌వ్ థాక్రే కుమారుడు ఆదిత్య‌థాక్రేను టార్గెట్ చేసింది. నేను సినీ మాఫియాతోపాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హ‌త్య‌, డ్ర‌గ్స్ అంశాన్ని లేవ‌నెత్తాను. డ్రగ్స్ వ్య‌వ‌హారంతో సీఎం కుమారుడు ఆదిత్యాథాక్రేకు త‌లనొప్పులు వ‌స్తాయ‌ని, అందుకే త‌న‌ను టార్గెట్ చేశార‌ని కంగ‌నా ఆరోపించింది. ఎవ‌రు ఎవ‌రి ప‌ని ప‌డ‌తారో చూడాల‌ని చుర‌క‌లంటించింది కంగ‌నా. 

బీఎంసీ అధికారులు ఇటీవ‌లే నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా నిర్మించారని ఆరోపిస్తూ కంగ‌నా కార్యాల‌యాన్ని కూల్చేసిన విష‌యం తెలిసిందే. అయితే హైకోర్టును ఆశ్ర‌యించ‌గా కూల్చివేత‌పై..కోర్టు స్టే విధించింది. మ‌రోవైపు ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ మ‌హారాష్ట్ర సీఎం కొష్యారిని క‌లిసి విజ్ఞ‌ప్తి చేసింది కంగ‌నా. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo