ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Oct 18, 2020 , 20:09:34

సోద‌రుడికి ప‌సుపు రాసిన‌ కంగ‌నా..వీడియో

సోద‌రుడికి ప‌సుపు రాసిన‌ కంగ‌నా..వీడియో

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌లే హైద‌రాబాద్ లో త‌లైవి షూటింగ్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. అయితే షూట్ పూర్త‌వ‌గానే స్వ‌స్థ‌లం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు వెళ్లిపోయింది కంగ‌నా. ఈ బ్యూటీ ఇపుడు త‌న సోద‌రుడు పెండ్లి ప‌నుల్లో బిజీ అయిపోయింది. కంగ‌నా మండిలోని నివాసంలో సోద‌రుడు అక్ష‌త్ ర‌నౌత్ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొంది. కంగ‌నా, సోద‌రి రంగోలి, కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి అక్ష‌త్ ర‌నౌత్ ముఖానికి ప‌సుపు రాస్తున్న వీడియోను ట్విట‌ర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. సోద‌రుడు అక్ష‌త్ ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల కోసం మండిలోని నాన ఇంటిలో..అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

అక్ష‌త్ వివాహం న‌వంబ‌ర్ లో జ‌రుగుతుంది. అత‌ని పెళ్లికి సంబంధించిన తొలి శుభ‌లేఖను మేన‌మామ‌కు ఇస్తామ‌ని చెప్పింది కంగ‌నా. కంగ‌నా వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.