గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 17:07:08

ముంబైకి చార్టెడ్ ఫ్లైట్ లో దీపికాప‌దుకొనే

ముంబైకి చార్టెడ్ ఫ్లైట్ లో దీపికాప‌దుకొనే

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో సంబంధ‌మున్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ న‌టి దీపికాప‌దుకొనే కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీచేసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు శుక్ర‌వారం దీపిక‌ను విచారించ‌నున్నారు. ఇక దీపిక ప్ర‌స్తుతం షూటింగ్ కోసం ఉత్త‌ర గోవాలోని సింక్వెరిమ్ బీచ్ గ్రామంలో ఉంది. ఎన్సీబీ విచార‌ణ నేప‌థ్యంలో దీపికా ప‌దుకొనే స్పెష‌ల్ చార్టెట్ ఫ్లైట్ లో ముంబైకు రానుంది. డ‌బోలిమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు నుంచి చార్టెట్ ఫ్లైట్ లో ముంబైకి ప‌య‌నం కానుంది. ముంబైకి చేరుకునే ముందు దీపిక న్యాయ‌నిపుణుల స‌ల‌హాలు తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.

దీపికాతోపాటు బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్, ర‌కుల్ ప్రీత్ సింగ్ ల‌కు కూడా నోటీసులు జారీచేసింది ఎన్సీబీ. గురువారం రకుల్ ప్రీత్ సింగ్‌, శ‌నివారం సారా అలీఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo