శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 18:43:25

భూమి-క‌ర‌ణ్ ల‌వ్ ట్రాక్ వీడియో సాంగ్

భూమి-క‌ర‌ణ్ ల‌వ్ ట్రాక్ వీడియో సాంగ్

భూమి పెడ్నేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం దుర్గామ‌తి. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి జీ అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ నుంచి తొలి వీడియో సాంగ్ ను విడుద‌ల చేశారు. బ‌రాస్ బ‌రాస్ అంటూ భూమి పెడ్నేక‌ర్, క‌ర‌ణ్‌ క‌పాడియా మ‌ధ్య సాగే ల‌వ్ ట్రాక్ పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ట్వింఖిల్ ఖ‌న్నా మేన‌ల్లుడు క‌రణ్ క‌పాడియా. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించే ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారిగా భూమి పెడ్నేక‌ర్ క‌నిపించ‌నుంది. సిల్వ‌ర్ స్క్రీన్ పై భూమి-క‌ర‌ణ్ క‌మెస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని సాంగ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. త‌నిష్క్ బాగ్‌చీ ఈ పాట స్వ‌యంగా రాసి మ్యూజిక్ నందించ‌డం విశేషం.

సింగింగ్ సెన్సేష‌న్ బీ ప్రాక్ ఈ పాట‌ను పాడాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన భాగ‌మ‌తి చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అనుష్క న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌లికారు


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.