గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 16:36:47

డ‌బ్బింగ్ పూర్తి చేసిన‌‌ బాలీవుడ్ బ్యూటీ

డ‌బ్బింగ్ పూర్తి చేసిన‌‌ బాలీవుడ్ బ్యూటీ

టాయ్ లెట్...ఏక్ ప్రేమ్ క‌థా చిత్రంతో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించింది బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేక‌ర్‌. ఆ త‌ర్వాత శుభ్ మంగ‌ళ్ సావ్‌ధాన్, ల‌స్ట్ స్టోరీస్, బాలా, సాండ్ కీ  ఆంక్ వంటి చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పించింది. ఈ భామ లీడ్ రోల్ లో న‌టిస్తున్న చిత్రం దుర్గావ‌తి. హారర్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తున్న  ఈ చిత్రంలో త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పుకుంది భూమి.  స్డూడియోలో స్క్రీన్‌పై పెద్ద తలుపులు క‌నిపిస్తుండ‌గా..భూమి డ‌బ్బింగ్ చెప్పింది. 

ఫొటోను షేర్ చేసి భూమి..'డ‌బ్బింగ్ పూర్త‌యింది. నా జీవితంలో చాలా ఉంది..ద‌ర్వాజా లోప‌ల ఎవ‌రున్నారు..బై దుర్గావ‌తి..నీలో ఉన్న మ‌రో కోణాన్ని చూస్తా..దుర్గావ‌తి చిత్రం డిసెంబ‌ర్ 11న అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల కాబోతుంద‌ని' క్యాప్ష‌న్ ఇచ్చింది. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌చ్చిన భాగ‌మ‌తి చిత్రాన్ని డైరెక్ట‌ర్ జీ అశోక్ హిందీలో దుర్గావ‌తిగా రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఒరిజిన‌ల్ వెర్ష‌న్ బాక్సాపీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo