గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 19:08:08

అలియాభ‌ట్ 'ఆర్ఆర్ఆర్' షూట్ డేట్ ఫిక్స్

అలియాభ‌ట్ 'ఆర్ఆర్ఆర్' షూట్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ ఆర్ఆర్ఆర్..రణం రౌద్రం రుధిరం చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ లో వేసిన స్పెష‌ల్ సెట్ లో షూటింగ్ కొన‌సాగుతోంది. ఈ చిత్రంలో అలియాభ‌ట్ అల్లూరి సీతారామ‌రాజు భార్య సీత పాత్ర‌లో న‌టిస్తుంద‌ని జ‌క్క‌న్న టీం ప్ర‌క‌టించి సుమారు 18 నెల‌లు అవుతుంది. అయితే అలియా హిందీ సినిమాలు చేస్తుండటంతో షూట్ లో పాల్గొన‌డం ఆల‌స్య‌మైంది. 

ఈ భామ‌ ఎప్పుడు షూట్‌లో జాయిన్ అవుతుంద‌నే దానిపై ఇప్ప‌టికే చాలా వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్రకారం న‌వంబ‌ర్ 2న అలియాభ‌ట్ ఆర్ఆర్ఆర్ టీంతో క‌లిసి షూటింగ్ లో జాయిన్ కానుంద‌ట‌. రాజ‌మౌళి నెక్ట్స్ షెడ్యూల్ లో అలియాపై వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నాడ‌ట‌. రూ.350 కోట్ల‌కుపైగా బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.