ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 19, 2020 , 18:23:22

ఈ భామ‌కు జంప్ షూట్ అంటే ఎంతిష్ట‌మో..!

ఈ భామ‌కు జంప్ షూట్ అంటే ఎంతిష్ట‌మో..!

అలియాభ‌ట్..ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌హేశ్ భట్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైనా..త‌న త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో కోట్లాదిమంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. క‌ర‌ణ్ జోహార్ కాంపౌండ్ నుంచి వ‌చ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ చిత్రంతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త‌క్కువ కాలంలో మంచి సినిమాలు చేస్తు అంద‌రి అభిమానం చూర‌గొంది. అలియా ఎప్పుడు క‌నిపించినా కెమెరాల‌న్నీ ఆమెవైపు తిప్పాల్సిందే. ఎందుకంటే ఇండ‌స్ట్రీలోని హీరోయిన్లలో అలియాభ‌ట్ డ్రెస్సింగ్ స్టైల్ కాస్త కొత్త‌గా ఉంటుంది. ఈ భామ‌కు జంపషూట్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌.

అలియా సినిమా ఫంక్ష‌న్ల‌కు హాజ‌రైనా, ఏవైనా ఈవెంట్స్ కు వెళ్లినా..జంప్ షూట్ ( స్లీవ్‌డ్ టాప్ మిక్స్ సింగిల్ డ్రెస్ ) ఉండాల్సిందే. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టే కొన్ని ఫొటోలు చూస్తే అలియాకు జంప్ షూట్ అంటే ఎంతిష్ట‌మో మీకు కూడా తెలుస్తోంది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మ‌రి.