శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 18:01:38

బాయ్‌ఫ్రెండ్ బిల్డింగ్‌లో ఫ్లాట్ కొన్న అలియాభ‌ట్‌..!

బాయ్‌ఫ్రెండ్ బిల్డింగ్‌లో ఫ్లాట్ కొన్న అలియాభ‌ట్‌..!

ర‌ణ్ బీర్ క‌పూర్-అలియాభ‌ట్..ఈ ఇద్ద‌రు బాలీవుడ్ స్టార్లు ఎక్క‌డా క‌నిపించినా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతున్న విష‌యం తెలిసిందే. అలియా-ర‌ణ్ బీర్ టైం దొరికిన‌పుడల్లా స‌ర‌దాగా క‌లిసి బ‌య‌ట‌కువెళ్తుంటారు. వీరిద్ద‌రి ఫొటోలు కూడా ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంటాయి. తాజాగా ఈ క్రేజీ స్టార్ల‌కు సంబంధించిన వార్త ఒక‌టి ట్రెండింగ్ అవుతోంది. ర‌ణ్ బీర్ క‌పూర్ ఉంటున్న అపార్టుమెంట్ లో అలియాభ‌ట్ ఓ ప్లాట్ కొనుగోలు చేసింద‌ట‌.

కృష్ణ‌రాజ్ బంగ్లాలోని 7వ ఫ్లోర్ లో  ర‌ణ్ బీర్ నివాసం ఉంటుండ‌గా..అలియా 5వ ఫ్లోర్ లో ఓ ప్లాట్ ను కొనుగోలు చేసిన‌ట్టు బీటౌన్ వ‌ర్గాల టాక్. నేష‌న‌ల్ మీడియా క‌థ‌నం ప్ర‌కారం..అలియా 2460 చ‌ద‌ర‌పు అడుగుల ప్లాట్ కోసం రూ.32 కోట్లు వెచ్చించిన‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. వాస్తు పాలి హిల్ బిల్డింగ్ ఏరియాలో ఈ ఫ్లాట్ ఉంటుంద‌ట‌.  అంతేకాదు త‌న ఫ్లాట్ ను అందంగా డెక‌రేట్ చేసుకునేందుకు అలియాభ‌ట్ బాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి, డిజైన‌ర్ గౌరీ ఖాన్ స‌హాయం కూడా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం అలియాభ‌ట్ త‌న త‌ల్లిదండ్రుల ఇంటికి స‌మీపంలో  సోద‌రి ష‌హీన్ భ‌ట్ తో క‌లిసి ఉంటుంది. అలియాభ‌ట్‌-ర‌ణ్ బీర్ క‌పూర్ 2021లో వివాహ‌బంధంతో ఒక్క‌టి కానున్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.